దీపికా రంగరాజు కి ఆస్తులు ఏమీ లేవు అంట
on Jul 11, 2025
బ్రహ్మముడి సీరియల్ ద్వారా దీపికా ఫుల్ ఫేమస్ అయ్యింది. రాజ్ కి చక్కని జోడిగా తెలుగు ఆడియన్స్ కూడా ఆమెకు బాగా కనెక్ట్ అయ్యారు. ఐతే ఆమె రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పింది. హోస్ట్ ని ఐతే బాగా రోస్ట్ చేసింది. "ఏంటి దీపికా నీకు బూరేలంటే ఇష్టమే..బుగ్గలు బూరెల్లా ఉంటేనూ" అంది హోస్ట్. దానికి వెంటనే దీపికా "మీకు స్కెలిటన్ అంటే ఇష్టమా. సైన్స్ ల్యాబ్ లో బయట ఉండే అలా ఉన్నారు మీరు" అనేసింది. దాంతో హోస్ట్ తలపట్టుకుంది. "ప్రెజెంట్ దీపికా మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి" అని హోస్ట్ అడిగేసరికి "ఈ ప్రపంచానికే తెలుసు నేను బ్రహ్మముడి సీరియల్ చేస్తున్నాను అని. కార్తీక దీపం ఫస్ట్ ఆఫర్ వచ్చింది నాకు.
ఐతే అప్పుడు సీరియల్ పేరు ఏమీ చెప్పలేదు. ఇలా బ్లాక్ మేకప్ వేసుకోవాలి అని చెప్పారు. అప్పుడు దేవుడు అంటే నాకు చాలా చాలా నమ్మకం. హైదరాబాద్ వచ్చాక నాకొక పెద్దమ్మ తల్లి బాగా ఇష్టం. ఆమె దగ్గరకు వెళ్లి బ్రహ్మముడి సీరియల్ బాగా హిట్ అవ్వాలి. నేను అందరికీ నచ్చాలి. కానీ దాని కంటే ఎక్కువగానే జరిగింది. బ్రహ్మముడి సీరియల్ దొరకడం ఒక అదృష్టం అంటే అందులో రాజ్ దొరకడం ఇంకా అదృష్టం. మానస్ దొరకడం శ్రీజకు అదృష్టం." అంటూ చెప్పుకొచ్చింది దీపికా. ఇక దీపికా ముందు న్యూస్ రీడర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. తర్వాత కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ లో నటించింది. అలాగే తమిళ్ మూవీ "ఆరడి"లో నటించింది. అలాగే తమిళ్ సీరియల్స్ చితిరం పేసుతడి" అనే సీరియల్ లో యాక్ట్ చేసింది. ఇక ఇప్పుడు తెలుగులో బ్రహ్మముడి సీరియల్ లో నటిస్తోంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
